రాజమహేంద్రవరంలో పోలీసులకు మస్కా కొట్టి ఓ నిందితుడు పరారయ్యాడు. తల్లిబాబు అనే వ్యక్తిని విజయవాడ పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. 2019లో అరెస్ట్ చేయగా అప్పటి నుంచి తల్లిబాబు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అతని కేసును సోమవారం విచారించిన రాజమహేంద్రవరం కోర్టు.. ఈ కేసులో తల్లిబాబుకు పదేళ్లపాటు జైలుశిక్ష విధించింది. అయితే కోర్టు వద్ద అతడిని కలిసేందుకు తల్లిబాబు భార్య వచ్చారు . వెంట భోజనం కూడా తెచ్చారు. అయితే భోజనం చేయడానికి వెళ్లిన తల్లిబాబు.. తిన్న తరువాత అతడు పారిపోయాడు