రాజమండ్రిలో దారుణం.. రక్తపు మడుగుల్లో ప్రేమజంట.. పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడమే కారణం!

2 hours ago 2
గోదావరి జిల్లాలో రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. ఈ రెండు ఘటనల్లోనూ యువతులు మృత్యువాత పడగా.. యువకులు కొన ఊపిరితో ఆస్పత్రి పాలయ్యారు. రాజమండ్రిలోని కాతేరు సమీప గామన్ వంతెన వద్ద యువతి గొంతుకోసి, ఆపై తాను చేతిని కోసుకుని పురుగుమందు తాగాడు. యువతి రక్తపుమడుగుల్లో మరణించగా..కొన ఊపిరితో ఉన్న యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కాలువలోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. యువకుడిని స్థానికులు రక్షించగా, యువతి శవమై తేలింది. ఈ రెండు ఘటనల్లోనూ పెళ్లికి పెద్దల అంగీకారం లేకపోవడమే కారణమని తెలుస్తోంది.
Read Entire Article