Rajahmundry Leopard Spotted: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు సమీపంలో చిరుత సంచారం కలకంరేపింది. దూరదర్శన్ కేంద్రానికి సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌లో చిరుత సంచారం రికార్డైంది. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే చిరుత కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోగాలింపు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులి సంచారం గురించి తెలిసి స్థానికంగా కలకలంరేపింది.