తెలంగాణకు చెందిన ఓ ప్రముఖుడు తన కుమారుడికి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిపించారు. ఇందుకోసం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్యాలెస్ లాంటి హోటల్‌ను బుక్ చేశారు. ఆగస్టు 8న గురువారం రాత్రి ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లిలో కోటిన్నర విలువైన నగలు, రూ.లక్ష నగదు ఉన్న బ్యాగును దొంగిలించాడు ఓ బాలుడు. కళ్యాణ మండపంలోనే ఈ ఘటన జరిగింది. అప్పటి వరకూ వరుడి తల్లి చేతిలోనే బ్యాగు ఉండగా.. ఆమె కాసేపు పక్కనబెట్టింది.