తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా బహిరంగంగానే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. కొంత కాలంగా రాష్ట్ర నాయకత్వం, సీనియర్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో.. వీళ్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో రాజాసింగ్‌కు బండి సంజయ్ క్లాస్ పీకినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.