తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఉన్న చెరో స్థానం.. ఏప్రిల్ 9వ తేదీతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సంఖ్యా బలంగా చూస్తే.. హస్తం పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ.. అభ్యర్థిని బరిలో నిలుపుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది సీనియర్లు.. ఈ రాజ్యసభ రేసులో ఉన్నారు. అయితే ఖాళీ కానున్న రెండు స్థానాల్లో ఒక స్థానం ఇప్పటికే ఉన్న అభిషేక్ మను సింఘ్వికే దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరి రెండో సీటు ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.