విజయవాడ రైల్వేస్టేషన్‌లో భారీగా వెండి ఆభరణాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి రైలు దిగిన ఓ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతని వద్ద 107 కేజీల వెండి ఆభరణాలను గుర్తించారు. అయితే వీటికి బిల్లులు లేకపోవటంతో స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా నుంచి వీటిని విజయవాడకు తెచ్చినట్లు తెలిసింది. మరోవైపు బిల్లులు లేని కారణంగా ఈ ఆభరణాలను జీఎస్టీ అధికారులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.