రాత్రికి రాత్రే ఆ కాలేజీ కూల్చివేత.. తమ భవిష్యత్తు ఏంటంటున్న విద్యార్థులు..

9 months ago 33
విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీశాయి. గురువారం రాత్రికి రాత్రే కొంతమంది ప్రొక్లెయిన్ల సాయంతో శాతవాహన కాలేజీని కూల్చివేశారు. బోయపాటి అప్పారావు పేరుతో బోర్డులు నాటారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని.. ప్రొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కనీసం సమాచారం ఇవ్వకుండా శాతవాహన కాలేజీని కూల్చవేశారని.. శిథిలాల కింద విద్యార్థుల రికార్డులు ఉండిపోయాయని.. వారి భవిష్యత్తు ఏం కావాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
Read Entire Article