మావోయిస్ట్ రాధ అలియాస్ నీల్సోను నక్సలైట్లే ఇన్ఫార్మర్ నేపంతో హత్య చేశారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే, ఇన్‌ఫార్మర్‌గా మారిందనడానికి ఆధారాలు ఏమున్నాయని ఆమె కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్లుగా లేని అనుమానం ఇప్పుడే ఎందుకు వచ్చిందని నిలదీస్తున్నారు. మూడు నెలల కిందట కమాండర్ బాధ్యతల నుంచి తప్పిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఎదురుచూశారని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు జరిగిన అన్యాయంపై స్పందించి, ఆదుకోవాలని రాధ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.