Hyderabad to Ayodhya Flight: హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు విమానయాన శాఖ తీపికబురు వినిపించింది. ఇకపై హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే 30 గంటలు ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.. కేవలం రెండున్నర గంటల్లోనే అయోధ్య రాములోని సన్నిధికి చేరుసుకునే అవకాశాన్ని విమానయాన శాఖ.. కల్పిస్తోంది. హైదరాబాద్ టూ అయోధ్య విమాన సర్వీసులతో పాటు మరో రెండు సర్వీసులను ఈరోజు (సెప్టెంబర్ 27న) నుంచి విమానయాన శాఖ ప్రారంభించింది.