ఏప్రిల్ 6వ తేదీన శ్రీరావ నవమి సందర్భంగా భద్రాద్రి సీతారాములవారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా.. కళ్యాణంలో వినియోగించే తలంబ్రాలను భక్తులు పొందాలని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం టీజీఎస్ ఆర్టీసీ ఎప్పటిలాగే ఈసారి కూడా హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు బుకింగ్ పోస్టర్‌ను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విడుదల చేశారు. మూడు విధాలుగా తలంబ్రాలను బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.