తిరుపతిలో అధునాతన సెవెన్ స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటికీ.. వివిధ కారణాలతో ముందుకు జరగలేదు. అయితే ఇప్పుడు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నుంచి సైతం అనుమతులు రావటంతో ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్ సెవెన్ స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో దీనిని ప్రకటించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు.