కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయని, వారి పంటలకు సాగునీరు కూడా అందడం లేదని విమర్శించారు. గద్ద వచ్చి కోడిపిల్లను తన్నుకెళ్లినట్లు ఏపీ వచ్చి తెలంగాణకు రావాల్సిన వాటా జలాలను లాగేసుకుంటుందని.. అయినా ఈ కాంగ్రెస్ సర్కార్.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు తెస్తారా? లేక చంద్రబాబు ఒత్తిడికి తలోగ్గుతారా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు.