జాగృతి కార్యకర్తల దాడితో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత, ఆమె కుటుంబమే తనను చంపించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బీసీ ఉద్యమాన్ని ఆపాలని చూస్తే పొరపాటేనని హెచ్చరించారు. తన కార్యాలయంపై జరిగిన దాడిలో కవిత అనుచరులు గన్‌మెన్ నుండి తుపాకీ లాక్కొని కాల్పులకు ప్రయత్నించారని మండిపడ్డారు. కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తానని శపథం చేశారు.