హిండెన్‌బర్గ్ నివేదికపై అధికార ఎన్డీయే, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సెబీ ఛైర్మన్‌కు అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు ఉన్నాయంటూ ఆ పత్రిక నివేదిక ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ పౌరసత్వం అంశాన్ని మరుగున పరిచేందుకు కాంగ్రెస్ ఈ కొత్త ఎత్తుగడ వేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీకి సంబంధించి బంగ్లాదేశ్ పత్రిక బ్లిట్జ్ ఓ సంచలన కథనం ప్రచురించింది.