హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. 161 కిలోమీటర్ల మేర సంగారెడ్డి-తూప్రాన్-గజ్వేల్-చౌటుప్పల్ వరకు ఆరు ప్యాకేజీల్లో నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి రూ. 7,104.06 కోట్లు మంజూరయ్యాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం టోల్ ప్లాజాలు, విశ్రాంతి గదులు, సర్వీస్ రోడ్లు, బస్ బేలు , ట్రక్ బేలతో పాటు మొత్తం 11 అత్యాధునిక ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.