రూ.40 వేల అద్దె.. వెయ్యి రూపాయలకే.. ఓయూలో ఏం జరుగుతోంది..?

9 months ago 18
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం కొనసాగుతుండగానే.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ క్వార్టర్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడంపై కొత్త వివాదం చెలరేగింది. విద్యార్థి సంఘాలు భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత వీసీ గత ఇన్‌ఛార్జి వీసీ హయాంలో ఈ కేటాయింపులు జరిగాయని అంగీకరించారు. ప్రొఫెసర్లకు రూ. 40,000 అద్దె వసూలు చేస్తుండగా.. ప్రైవేటు వ్యక్తులకు రూ. 1,000కే కేటాయించడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న క్వార్టర్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడంపై సమగ్ర విచారణ జరిపి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article