తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గత మూడు నెలలుగా రూ.375 రాష్ట్ర సబ్సిడీ వారి ఖాతాల్లో జమ కావడం లేదు, దాదాపు రూ.150-180 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. సిలిండర్ మార్కెట్ ధర రూ.915 చెల్లించి కొనుగోలు చేస్తున్న వినియోగదారులు సబ్సిడీ ఆలస్యం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ నిధుల విడుదల ఆలస్యం అవుతోంది.