ఇప్పటి వరకు ఈ-కేవైసీలు, లాటరీలు, డ్రగ్స్ పార్శిల్, ఖరీదైన గిఫ్టుల పేరుతో మోసాలు చేసిన సైబర్ కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్తగా నకిలీ వెబ్‌సైట్‌లతో మోసాలు చేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారిని ఈజీగా బురిడీ కొట్టించి రూ.1.28 కోట్లు కొట్టేశారు.