ప్రస్తుత కాలంలో పెళ్లి అనగానే హడావుడి ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రీవెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, మెహందీ, సంగీత్, బరాత్, రిసెప్షన్ అంటూ హంగూ ఆర్భాటాలు, లక్షల కోట్ల ఖర్చుతో పెళ్లిళ్లు ఆడంబరంగా జరుగుతుంటాయి. అయితో ఓ జంట మాత్రం అలాంటివేవీ లేకుండా కేవలం రెండు నిమిషాల్లోనే ఒక్కటైంది. రూపాయి ఖర్చు లేకుండా ఉంగరాలు, పూలదండలు మార్చుకుని ఎంతో నిరాడంబరంగా ఒక్కటయ్యారు. ఈ వివాహానికి హైదరాబాద్‌లోని శ్రీరామచంద్ర మిషన్ హార్ట్‌ఫుల్‌నెస్ సెంటర్ వేదికైంది.