రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన గుండేటి రాహుల్‌కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా, పులకుర్తి గ్రామానికి చెందిన రాహుల్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చికిత్స, కృత్రిమ కాళ్ల అమరికకు ఆర్థిక సహాయం అందించింది. ఈ సహాయం అందుకున్న రాహుల్, తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయనిధి అందుబాటులో ఉంటుందని.. పేద ప్రజల కష్టాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.