రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

7 months ago 24
తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు భరోసా పెరిగిందని... ప్రతి నియోజకవర్గానికి ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదల సొంతింటి కల నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం డైట్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచామని వివరించారు.
Read Entire Article