ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. 2 రోజులుగా ఢిల్లీలోనే బిజీబిజీగా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతున్న రేవంత్ రెడ్డికి తోడు ఇద్దరు కీలక మంత్రులకు హస్తిన నుంచి పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదట ఉత్తమ్.. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టిని ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో వారిద్దరూ బయల్దేరారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ఉన్న మంత్రుల శాఖల మార్పు ఉంటుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు మరిన్ని కీలక అంశాలపై ఢిల్లీలో హాట్ హాట్ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.