రానున్న రోజుల్లో డిమాండ్ ఎంతగా పెరిగిన రెప్పపాటు అంతరాయం లేకుండా అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎలాంటి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే 1912 టోల్ ప్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతారని తెలిపారు.