ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరి రేపటితో (జూన్ 12) ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 12న తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి.. రూ.8745 కోట్లు విడుదల చేయనున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తి అయ్యి.. ఆ సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.