సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి హాట్ కామెంట్స్ చేసారు. అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయినందుకే ఆయన్ను కక్ష పూరితంగా అరెస్ట్ చేశారన్నారు. పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇక ఈ-కార్ రేసింగ్ వ్యవహారంపై తాను చర్చకు సిద్ధమని.. సీఎం రేవంత్‌కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.