Amrut Scheme Scam: అధికారంలోకి వచ్చిన మూడు నెలల గ్యాప్‌లో సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి తెర తీశాడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అమృత్ పథకంలో భాగంగా టెండర్ల పేరుతో రూ.8888 కోట్ల కుంభకోణం చేశారంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుంభకోణం జరిగిందనటానికి సాక్ష్యాలివే అంటూ పలు అధారాలను మీడియా ముందు పెట్టారు కేటీఆర్. మున్ముందు కూడా రేవంత్ రెడ్డి కుంభకోణాలను ప్రజల ముందు ఉంచుతామని కేటీఆర్ పేర్కొన్నారు.