తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీలోకి వెళ్తారో.. ఎవరి గురించి ఎలాంటి స్టేట్‌మెంట్ ఇస్తారో అన్నది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. నిన్నటి వరకు విమర్శలతో విరుచుకుపడిన నేత.. ఈరోజు ప్రశంసలతో ముంచెత్తుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే కోవలోకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా చేరిపోయారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని ఏ క్షణమైనా వదిలేస్తారన్నట్టుగా ఉన్న మోత్కుపల్లి ఈరోజు క్లారిటీ ఇచ్చారు.