ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీరంగాలకు చెందిన వ్యక్తులు రియాక్టయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ప్రమాదం జరిగితే అందుకు అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదని రఘురామకృష్ణరాజు అన్నారు. బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.