హైడ్రాను మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తు మెుదలుపెట్టింది. హైడ్రాను మూడు జోన్లుగా విభజించి.. ఎస్పీ స్థాయి అధికారికి ఒక్కో జోన్ బాధ్యతను అప్పగించేందుకు రెడీ అయ్యింది. అలాగే హైడ్రా చట్టబద్దతపై త్వరలో ఆర్డినెన్స్ జారీకి న్యాయశాఖ కసరత్తు మెుదలు పెట్టింది. ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది.