తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని ఆదేశించారు. ఇక డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అదే సమయంలో బీసీ కులగణన కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని పేర్కొన్నారు.