రేషన్‌ కార్డు ఉంటే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. మరో 5 లక్షల కుటుంబాలకు లబ్ధి

1 month ago 3
మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తరించనుంది. ప్రస్తుతం 42.90 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతుండగా.. తాజాగా మరో ఐదు లక్షలకుపైగా కుటుంబాలను పౌరసరఫరాల శాఖ అర్హులుగా గుర్తించింది. కొత్త రేషన్‌ కార్డులు పొందిన కుటుంబాల్లో పలువురు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అర్హుల జాబితా ప్రభుత్వ ఆమోదం కోసం పంపగా.. ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. ఆమోదం లభిస్తే కొత్త కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్‌ ప్రయోజనం అందనుంది.
Read Entire Article