తెలంగాణలో రేషన్‌కార్డు లబ్ధిదారులకు చేదువార్త. పలువురికి రేషన్ కట్ కానుంది. ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారిని అధికారులు అనర్హులుగా గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 76,842 మంది రేషన్ లబ్ధిదారులకు రేషన్ నిలిపివేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లోనే ఎక్కువ మంది అనర్హులున్నట్లు అధికారులు గుర్తించారు.