తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికీ గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, ఈబీసీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారు ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.