బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో.. పేదలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి సర్కారు తీపికబురు చెప్పింది. వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై కందిపప్పును కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి వెల్లడించారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం జూన్‌లో అధికారం చేపట్టిన వెంటనే ఈ పథకం అమలవుతుందని ప్రచారం జరిగింది.