రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రియాక్షన్

1 month ago 6
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై మాజీ ముఖ్మమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రేషన్‌ బియ్యంపై ప్రభుత్వం కథనాలు, మాటలు చూస్తుంటే అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తోందని అన్నారు. ఏపీలో అధికారం చేతులు మారి ఏడు నెలలైందన్న వైఎస్ జగన్.. మంత్రులు, అధికారులు, చివరకు చెక్‌పోస్టులు కూడా వాళ్లు పెట్టినవే ఉన్నాయని అన్నారు. కాకినాడ పోర్టులో కస్టమ్స్‌, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారన్న జగన్ .. కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని అన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు? ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తారని.. కానీ ఆ షిప్ వద్దకు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లలేదని విమర్శించారు.
Read Entire Article