Andhra Pradesh Ration Rice Polishing Mafia: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతోంది. పల్నాడు ప్రాంతంలో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, సన్న బియ్యంగా మార్చి చెన్నైకి తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో లారీ బోల్తా పడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దళారులు రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొని, మిల్లులకు అమ్మేస్తున్నారు. అక్కడ వాటిని రీసైక్లింగ్ చేసి, కొత్త సంచుల్లో నింపి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.