రైతు ఎవరి కడుపు కొట్టడు సార్.. కంటతడి పెట్టిస్తున్న మహిళ ఆవేదన

5 days ago 5
Khammam Farmer: అకాల వర్షాలకు ఐకేపీ సెంటర్‌లో తడిసిన ధాన్యాన్ని చూపిస్తూ.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన మహిళా రైతు చంద్రకళ కంటతడి పెట్టిన తీరు అందరినీ కలచివేస్తోంది. ‘రైతు నలుగురి కడుపు నింపుతాడు కానీ, నలుగురి కడుపు కొట్టడు’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైతు మట్టి తిని, మట్టి కక్కుతున్నాడు. మా మీద దళారులు మాత్రం బ్రతుకుతున్నారు’ అంటూ ఆమె గోడు వెళ్లబోసుకున్నారు. తాము 18 ఎకరాల్లో వరి సాగు చేశామని, పండించిన వడ్లను ఐకేపీ సెంటర్‌కి తీసుకొస్తే.. రెండు వారాలకు పైగా అయిన కొనలేదని తెలిపారు. ప్రభుత్వం వడ్లు కొనను అని చెప్పినా తాము బయట అమ్ముకునే వాళ్లం అంటూ కంటతడి పెట్టారు. ప్రభుత్వం ఒకవైపు రూ. 500 బోనస్ ఇస్తుంటే, మరోవైపు యూరియా బస్తాకు రూ.1400 తీసుకుంటున్నారని చెప్పారు. రైతు ఎన్ని కష్టాలు పడుతున్నా.. నలుగురికి అన్నం పెట్టేందుకు మళ్లీ సాగు చేస్తూనే ఉంటాడంటూ ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
Read Entire Article