రైతు పొలాల్లోకి బ్యాంక్ అధికారులు.. ఏం చేశారో తెలుసా..?

1 month ago 7
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని పలు గ్రామాల్లో పంట రుణాలు చెల్లించలేదని రైతుల పొలాల్లో బ్యాంక్ అధికారులు ఎర్ర జెండాలు పాతారు. ఖమ్మం డీసీసీబీ పరిధిలోని పలు బ్రాంచ్ ల ద్వారా రైతులు రుణాలు తీసుకున్నారు. నేలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లోన్ని రైతులు కూడా ఉండగా రుణాలు చెల్లించలేదంటూ కోనాయిగూడెం, ఆరెగూడెం గ్రామాల్లోని పొలాల్లో బ్యాంకు అధికారులు ఎర్రజెండాలు పాతారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం వల్లే జెండాలు పాతుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకు అధికారుల తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article