తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్‌కు సంబంధించి 68.85 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది. అయితే, బ్యాంక్ ఖాతాలు గత ఆరు నెలలుగా రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల 4,405 మంది రైతులకు నిధులు నిలిచిపోయాయి. ఈ విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. తక్షణమే ఖాతాలను పునరుద్ధరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాలతో నిధులు ఆగిన రైతులు తమ బ్యాంక్ ఖాతాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.