తెలంగాణ ప్రభుత్వం రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. రూ. లక్షన్నర లోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా.. మాఫీ వర్తించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రుణమాఫీ జరగని వారు తమకు కాల్ చేస్తే.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.