రాబోయే వ్యవసాయ సీజన్‌లకు ఎస్‌ఎల్‌బీసీ(రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ) పంట రుణాలను ఎకరాకు రూ. 2-3 వేలు పెంచింది. ఇప్పటి వరకు రైతులు ప్రణాళిక ప్రకారం రుణాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు.. సీడ్ పత్తి రుణాలపై అవగాహన లేకపోవడం కూడా సమస్యగా ఉంది. సీడ్ పత్తి సాగు సాధారణంగా ఒప్పంద ప్రాతిపదికన జరుగుతుంది. దీని కారణంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.