కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ప్రారంభించనుంది. వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. ఈ సంఖ్య కేంద్ర పథకాలకు అనుసంధానం చేయబడుతుంది. అయితే.. రైతుల ఈ విశిష్ట సంఖ్యకు, రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.