బంగారు రుణాలు తీసుకునే రైతులకు శుభవార్త చెప్పారు అధికారులు. గోల్డ్ తనఖా పెట్టి.. డీసీసీబీ, పీఏసీల్లో రుణాలు తీసుకునే వారికి వడ్డీ రేట్లను తగ్గిస్తూ డీసీసీబీ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య పేర్కొన్నారు. అబిడ్స్ స్టేషన్ రోడ్డులోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన బ్యాంకు పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భూమి పట్టాలపై రుణాలు తీసుకుని ఇతర అవసరాలకు వాడుకునే వారి పట్ల బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో బంగారు రుణాలపై వడ్డీ విధానం వివిధ బ్యాంకులను బట్టి మారుతుంది. డీసీసీబీ రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతోంది.