ఏపీ రైతులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు అందరికీ అన్నదాత సుఖీభవ డబ్బులు అందిస్తామని తెలిపింది. ఈ- కేవైసీ పెండింగ్ కారణంగా కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అందలేదు. ఈ నేపథ్యంలో ఈ- కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలని రైతులకు అధికారులు సూచించారు. ఈ ప్రక్రియలు పూర్తి చేసుకున్న రైతులకు విడతల వారీగా డబ్బులు అకౌంట్లలో జమ చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.