తెలంగాణ రైతులకు మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది రేవంత్ సర్కార్. ఇప్పటికే రైతు రుణమాఫీని అమలు చేస్తుండగా.. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అయిన వరికి 500 బోనస్‌ను కూడా ఈసారి నుంచే అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. కేవలం సన్నరకాలు వేసిన రైతులకే ఈ 500 రూపాయల బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే.. ఈ బోనస్ ఈ సంవత్సరం నుంచే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.