ఎండల కారణంగా వరి పంటలు ఎండిపోతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చేందుకు చర్యల తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ ఈ మేరకు గ్రామాలు, మండలాలు, జిల్లాల స్థాయిలో వివరాలు సేకరిస్తోంది. అదనంగా.. నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పెంచుకునే చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. గతంలో వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. పంటలు ఎండి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.