తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ శుభవార్త తెలిపింది. రబీ సీజన్‌కు సంబంధించి నాలుగు నుంచి పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే నెలాఖరులో రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. అవసరమైన నిధుల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి, చెల్లింపులపై స్పష్టత ఇవ్వనున్నారు. జూన్ నెలలో రబీ సీజన్ చెల్లింపులు పూర్తి చేసి, జూలై నుంచి ఖరీఫ్ సీజన్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.