రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో దీనిని రైతుబంధుగా పిలవగా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతుభరోసా పేరు మీద నిధులను జమ చేస్తున్నారు. ఒక ఎకరానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. రెండు విడతులుగా ఈ మనీ ఇస్తుండగా.. మొదటి విడత డబ్బులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో చేరాయి. అయితే 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ నగదు జమ అయింది. మిగిలిన రైతులకు ఎప్పుడు జమ చేస్తారనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.