తెలంగాణలో ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా సమస్యకు భూభారతి చట్టంతో పరిష్కారం లభించనుంది. తొమ్మిది లక్షల కుటుంబాలకు ఊరట కలగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్-2025 ద్వారా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించనుంది. గతంలో జీవో 112 ద్వారా 2.26 లక్షల దరఖాస్తులు.. ఆ తర్వాత 6.74 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కోర్టు స్టే కారణంగా పరిష్కారం ఆలస్యమైంది. కొత్త చట్టంలో పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.